బల్దియా పోరు.. ఎంపీ జోరు
ప్రచారంలో ముందుంటున్న ‘కంది’
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకమే. అనేక వార్డుల్లో తన అనుచరులే పోటీ చేస్తుండగా, మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నివాసముంటున్న 38వ వార్డు కై లాస్‌నగర్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. హస్తం పార్టీ నుంచి యెల్మలవార్ అర్చన పోటీ చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో ముందుకుసాగుతున్నారు.
ఎంపీ గోడం నగేశ్ జిల్లా కేంద్రంలోని 37వార్డు పరిధి ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించి బల్దియా పీఠాలు కై వసం చేసుకోవాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన నివాసముండే వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ కాగా పార్టీ అభ్యర్థిగా మానస పోటీ చేస్తున్నారు. ఈ వార్డులో మానస గెలుపు ఎంపీకి కీలకంగా మారింది.
గర్జిస్తున్న ‘రంగినేని’
జెండా ఎగరాలంటున్న ‘జాదవ్’
డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ కూడా 37వ వార్డు పరి ధిలోని రవీంద్రనగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటారు. ఈ వార్డు జనరల్ మహిళకు రిజ ర్వ్ కాగా, తాజా మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్ సతీమణి సుష్మ పోటీ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని జాదవ్ సొంత వార్డులో పార్టీ అభ్యర్థి గెలుపును సవాల్‌గా తీసుకున్నారు.
ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా తన ప్యానల్‌తో ఏఐఎఫ్‌బీ పార్టీ సింహం గుర్తుపై మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. తాను 48వ వార్డు హమీద్ పురా నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో మొదటి మహిళా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఆమె అప్పుడు కూడా ఇదే వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు. ఈసారి తన సొంత ప్యానల్‌తో బరిలోకి దిగి ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు.
బల్దియా పోరు.. ఎంపీ జోరు
బల్దియా పోరు.. ఎంపీ జోరు
బల్దియా పోరు.. ఎంపీ జోరు


