భీమన్న దేవుడికి పూజలు
నేరడిగొండ: మండలంలోని బుగ్గారం గ్రామంలో నిర్వహించిన భీమన్న జాతరకు బోథ్ ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ కృష్ణ నాయక్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.
నాగమల్యాల్‌లో ఊరేగింపు..
మండలంలోని నాగమల్యాల్ గ్రామంలో నా యకపోడ్ భీమన్న దేవుడి ఊరేగింపును గ్రా మస్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. వీధులన్నీ భీమన్న నామస్మరణతో మార్మోగాయి. సర్పంచ్ గోడం నందిని అమృత్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, గంగారాం, హనుమంతు, హనుమడ్లు, గంగన్న తదితరులు పాల్గొన్నారు.
భీమన్న దేవుడికి పూజలు


