వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని తల్లి చెప్పినందుకు బాలుడు పురుగుల మందు తాగాడు. అప్పులు తీర్చే మార్గం లేక వ్యక్తి, చెల్లె కుమార్తె చూడడానికి భర్త తర్వాత తీసుకెళ్తానని చెప్పినందుకు భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
క్షణికావేశంలో బాలుడు..
పురుగుల మందు తాగి వివాహిత..
చింతలమానెపల్లి: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇస్లావత్ నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని రవీంద్రనగర్ గ్రామానికి చెందిన సుచిత్ర రాయ్(27), పరేష్ రాయ్ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. భర్త పరేష్ రాయ్.. కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 2న సుచిత్ర రాయ్ తన చెల్లె కుమార్తెను చూడటానికి తీసుకెళ్లమని భర్తను కోరింది. ఈనెల 3న గ్రామంలో క్రికెట్ పోటీల ముగింపు ఉన్నందున బుధవారం వెళ్దామని భర్త చెప్పాడు. మనస్తాపం చెందిన సుచిత్ర రాయ్ ఈనెల 3న రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి రాజేందర్ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
పురుగుల మందు తాగి ఒకరు..
తాంసి: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జీవన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పాలోది గ్రామానికి చెందిన సిరికొండ చందర్(42) ఐకేపీలో వీవోఏగా పని చేస్తున్నాడు. ఆయనకు ఉన్న సొంతభూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. గత రెండేళ్ల క్రితం భార్యకు అనారోగ్యం గురికాగా, వైద్యం, ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు చేశాడు. వ్యవసాయంలో పంట దిగుబడి రాక రెండేళ్లుగా అప్పులు పెరిగాయి. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందాడు. శుక్రవారం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. మృతదేహన్ని ఎస్సై పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుమార్తె అఖిల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య


