ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని హైదరాబాద్ యాఖత్‌పుర నియోజకవర్గ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహరాజ్ తెలిపారు. 24వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో విలేకరులకు అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. మైనార్టీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మరో నాలుగు వార్డులకు శుక్రవారం పేర్లు ఖరారు చేయనున్నట్లు వివరించారు. ముస్లిం మైనార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యల పరిష్కారం, వారి అభివృద్ధి కోసం ఎంఐఎం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరా రు. ఎన్నికల ప్రచారానికి పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరొద్దీన్ ఓవైసీ రానున్న ట్లు తెలిపారు. త్వరలోనే ప్రచార తేదీలు ఖరారు చే స్తామని స్పష్టం చేశారు. ఎంఐఎం పట్టణాధ్యక్షుడు నజీర్ అహ్మద్, అత్తు తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థుల వివరాలు
రెండో వార్డు అభ్యర్థిగా షేక్ నైమతుల్లా, నాలుగో వార్డుకు షేక్ అఖ్తర్, ఆరుకు సమ్రిన్ సుల్తానా, ఏడుకు ఫాతిమా, ఎనిమిదికి ఎం.నాగ్‌సేన్, 10వ వార్డుకు జమీలా బేగం, 11కు పీ అనిత, 15కు షేక్ జహీర, 16కు ఆస్మా పర్వీన్, 17కు కిశోర్‌జాదవ్, 18కి వీ కాంబ్లే, 19కి రఫియా బేగం, 21కి జావిద్‌ఖాన్, 22కు సమీనా బేగం, 23కు సయ్యద్ సలీమ్, 25కు సల్మా పర్వీన్, 26కు అబుజర్, 28కి బాబుషా, 29కి షహనాజ్, 30కి జమీర్ ఉద్దీన్, 32కు సయ్యద్ రఫీక్, 35కు ఇనాయత్, 38కి ఇర్ఫాద్ అలీ, 44వ వార్డుకు మహ్మద్ రోహిత్‌ను ప్రకటించారు.


