కొనుగోలు కేంద్రాల్లోనే కందులు విక్రయించాలి
ఆదిలాబాద్‌టౌన్: కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు విక్రయించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. గురువారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదట కాంటాకు పూజలు చేసి రైతును సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు క ల్పించినట్లు తెలిపారు. క్వింటాల్‌కు రూ.8వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 44,448 ఎకరాల్లో కంది సాగైందని, 22వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన ట్లు తెలిపారు. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల చొ ప్పున కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్కెటింగ్ ఏడీ గజానంద్, డీఏవో శ్రీధర్‌స్వామి, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్ పాల్గొన్నారు.


