‘కమీషన్ల కోసం అభివృద్ధిని విస్మరించారు’
ఆదిలాబాద్: గత పాలకులు కమీషన్లకు కక్కుర్తి పడి ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మాజీ కౌన్సిలర్ అందె శ్రీదేవి బీజేపీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప ట్టణాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. విలీన గ్రామాల్లో అంతర్గత రహదారులు అ ధ్వానంగా మారి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నా రు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి పట్టణా న్ని ఆదర్శ పట్టణంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉ న్న పశువధశాలను తొలగించినట్లు చెప్పారు. రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. 47వ వార్డుకు చెంది న సాయి సృజన్, పలువురు స్థానికులున్నారు.


