పొర్లు దండాలతో పోడు రైతు నిరసన
ఖానాపూర్: అటవీశాఖ అధికారులు తన ఎడ్ల జతను నిర్భందించడాన్ని నిరసిస్తూ మండలంలోని తర్లపాడుకు చెందిన పోడు రైతు భూమన్న బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపాడు. కొన్ని దశాబ్దాలుగా సాగులో ఉన్న తన భూమిలో అట వీశాఖ అధికారులు జేసీబీతో గుంతలు తవ్వి మొక్కలు నాటడంతో పాటు అక్రమంగా పోడుభూమి సా గు చేసుకుంటున్నానని తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. గత నెల 21న తీసుకువచ్చిన ఎడ్లను ఇప్పటికీ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.


