మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
కైలాస్‌నగర్(బేల): జిల్లాలో మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బేల పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, వాహనాలను పరిశీలించారు. కేసు ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సిబ్బంది కోసం నిర్మించిన విశ్రాంతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలా పాలు పూర్తిగా రూపుమాపాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ శ్రావణ్, బేల ఎస్సై ప్రవీణ్‌కుమార్, తదితరులున్నారు.


