దేశీదారు పట్టివేత
సాత్నాల: భోరజ్ మండలంలోని గిమ్మ శివారులో సోమవారం దేశీదారు పట్టుకున్నట్లు ఎస్సై పవర్ గౌతమ్ తెలిపారు. జైనథ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా రాంపూర్‌కు చెందిన సినారె వినోద్, ఉట్ల ప్రవీణ్ ఎక్సెల్ వాహనంపై సంచితో అనుమానాస్పదంగా కనిపించారు. సంచిని తనిఖీ చేయగా 240 లీటర్ల 90 ఎంఎల్ దేశీదారు బాటిళ్లు లభించాయి. వాటి విలువ రూ.12 వేలు ఉంటుందన్నారు. మహారాష్ట్రలోని చేనాక నుంచి తెచ్చినట్లు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


