రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలింగ్ అధికారుల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షి షా, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని 216 పోలింగ్ కేంద్రాలకు ర్యాండమైజేషన్ ద్వారా టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి పీవో, ఏపీవో, ముగ్గురు పోలింగ్ అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. మరో 15 శాతం అధికారుల ను రిజర్వ్‌లో ఉంచినట్లుగా కలెక్టర్ తెలిపారు. తుది విడత ర్యాండమైజేషన్‌ను ఈనెల 9న నిర్వహించనున్నారు.కార్యక్రమంలోమున్సిపల్ కమిషనర్ జి.రా జు, నోడల్ అధికారులుఫణిందర్‌రావుపాల్గొన్నారు.
ఎన్నికల నియమావళిపై అవగాహన అవసరం
ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన అవసరమని సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఎ న్నికల ప్రవర్తన నియమావళి, వ్యయ నియంత్రణ పై కౌన్సిలర్ అభ్యర్థులు, ఏజెంట్లకు బుధవారం అ వగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నిక ల వ్యయం రూ.లక్షకు మించొద్దన్నారు. ఖర్చుల వి వరాలునిర్ణీతప్రొఫార్మాలో పొందుపరచాలన్నారు.


