ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు

Feb 9 2026 7:38 AM | Updated on Feb 9 2026 7:38 AM

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు

కైలాస్‌నగర్‌: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు ఆదివారంతో ముగిసింది. మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో వారికి ఈ నెల 6నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. మూడు రోజుల్లో 348 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో 52 మంది సర్వీస్‌ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ పంపించారు. వీరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఓటు వేసిన బ్యాలెట్‌ పత్రాలను పంపించనున్నారు. కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజర్షి షా ఆదివారం సందర్శించారు. పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించా రు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, బ్యాలెట్‌ పేపర్ల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఓటింగ్‌ పూర్తయిన తర్వాత వాటిని నిబంధనల మేరకు భద్రపరచాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జి.రాజు, ఎన్నికల నోడల్‌ అధికారి ఫణిందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement