ఆర్జీయూకేటీలో గణతంత్ర వేడుకలు
బాసర: బాసరలోని ఆర్జీయుకేటీలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు ఇచ్చిందన్నారు. యువత రాజ్యాంగ విలువలను ఆచరించడమే నిజమైన దేశసేవ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యతలు అలవర్చుకోవాలని సూచించారు.
పీయూసీ స్టడీ అవర్స్..
విద్యార్థుల ’పీయూసీ స్టడీ అవర్స్’ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి ప్రపంచ రికార్డు నెలకొల్పిందన్నారు. రాత్రిపూట 3,238 మంది పీయూసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ విజయాన్ని సాధించారన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ, విద్యార్థులు దేశభక్తి, సామాజిక స్పృహతో దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.


