ఢిల్లీ వేడుకల్లో ఆదివాసీ నృత్య ప్రదర్శన
ఇచ్చోడ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆదివాసీ కళాకారుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీ కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో కళాకారులు రవ్వ చిట్టిబాబు, హరీష్, వినోద్, రమేశ్, సాయి, జయరాజు, ముత్తయ్య, నాగబాబు, కుమారి బేబీ, భద్రమ్మ, జ్యోతి, స్వప్న, శైలజ, అనిత, నాగమణి, ఇందు, సుస్మిత పాల్గొని ఆదివాసీ నృత్యం ప్రదర్శించారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ సుందర భాస్కర్ రవీంద్ర కుమార్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.


