సైగలతో నృత్యం చేసి..పియానో వాయించి
పియానో వాయిస్తున్న జంగుబాయి
సైగలతో నృత్యం చేస్తున్న విద్యార్థులు
ఉట్నూర్‌రూరల్: వైకల్యం దేనికీ అడ్డుకాదని..పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని వికాసం దివ్యాంగుల ప్రత్యేక బాలబడి విద్యార్థులు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కేబీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో డ్యాన్స్ ఉపాధ్యాయురాలు చేతులతో చేస్తున్న సైగలను చూసి నృత్య ప్రదర్శన చేశారు. మూడోతరగతి విద్యార్థిని జంగుబాయి వందేమాతరం గేయానికి పియానో వాయించి అందరినీ ఆకట్టుకుంది. సదరు విద్యార్థులను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అభినందించారు.
సైగలతో నృత్యం చేసి..పియానో వాయించి


