నలుగురికి ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతి
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నలుగురికి ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం.రాజేశ్వర్, ఆదిలాబాద్ డీపీఈఓ కా ర్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, నిర్మల్ జిల్లా ఎకై ్సజ్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి.ముత్యం, కుమురంభీం ఆసిఫాబాద్ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.రా జశేఖర్‌కు ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతులు లభించాయి.
పురుగుల మందు తాగి
ఒకరు ఆత్మహత్య
ఆసిఫాబాద్‌రూరల్: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సింగరావుపేట్ గ్రామానికి చెందిన పోచయ్య (55) ఈ నెల 23న మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ముందుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. పత్తి దిగుబడి తగ్గిందనే దిగులుతోనే పురుగుల మందు తాగినట్లు భార్య కనకలక్ష్మి ఇచ్చిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం ప్రతిజ్ఞ
దిలావర్‌పూర్: మండలంలోని గుండంపల్లిని గ్రామస్తులు సోమవారం ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సంధర్భంగా సర్పంచ్ తక్కల రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిజ్ఞ చేశారు. గతంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసి ప్లాస్టిక్, పేపర్ రహితానికి నాంది పలికామని సర్పంచ్ తెలిపారు. ఇదే బాటలో పేపర్‌ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాస్‌లు, క్యారీ బ్యాగులను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి పతకానికి ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 2026 సంవత్సరానికిగానూ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాబితాలో వెంకటరాములు చోటు దక్కించుకున్నారు. అసాధారణ సేవలకు గుర్తింపుగా లభించిన ఈ అత్యున్నత పురస్కారంపై బెటాలియన్ అధికారులు, సిబ్బంది వెంకటరాములును ప్రత్యేకంగా అభినందించారు.


