ఏడుగురు దొంగల అరెస్ట్
బోథ్: మండలంలోని కౌఠ (బి) గ్రామ శివారులో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు దొంగలను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ డి.గురుస్వామి తెలిపారు. పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో పత్తి చేనుల్లో చోరీలకు పాల్పడుతున్న సుంకరి చిలకయ్య, ఎస్కే నాసిర్, మామిడి శ్రీనివాస్, అశోక్, రాజారాప దత్తు, ఎస్కే షాపితో పాటు దొంగ సరుకు కొనుగోలు చేసిన అల్లం చెందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 30 కిలోల పత్తి, సోలార్ ప్యానెల్, బ్యాటరీలతో పాటు చోరీకి ఉపయోగించిన బొలెరో మ్యాక్స్ వాహనం, రూ.9,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైతుల ఫిర్యాదు మేరకు ఐదు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.


