కలప వినియోగిస్తే కఠినచర్యలు
నేరడిగొండ: అక్రమ కలప వినియోగిస్తే కఠినచర్యలు తప్పవని అటవీరేంజ్ అధికారి బెజ్జరం గణేశ్ హెచ్చరించారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి చిన్న విశ్వనాథ్ బుసరెడ్డి ఆదేశాల మే రకు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీచరా గ్రామంలో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గృహ నిర్మాణాల్లో అనుమతి లేని అటవీ కలప వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్థానిక వడ్రంగుల వద్దకు వెళ్లి ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీ కలపను వినియోగించకూడదని సూచించారు. అనంతరం పలువురు వడ్రంగులకు నోటీసులు జారీ చేశారు. ఆయన వెంట నేరడిగొండ అట వీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి లఖన్‌సింగ్, బీట్ అధికారి సచిన్, సిబ్బంది ఉన్నారు.


