నిర్భయంగా ఓటు వేయాలి
ఆదిలాబాద్‌టౌన్: నిర్భయంగా ఓటుహక్కు విని యోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం, డబ్బు, బహుమతులు తరలించకుండా చర్యలు చేపట్టినట్లు పే ర్కొన్నారు. ఎలాంటి సమాచారమున్నా ‘డయల్ 100’కు తెలుపాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, అనుమ తి లేకుండా ర్యాలీ, సభలు నిర్వహించవద్దని తెలి పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, సీఐలు సునీల్‌కుమార్, నాగరాజు, ప్రణయ్‌కుమార్, ఎస్సైలు స్వామి, అశోక్, నాగనాథ్, రమ్య, విష్ణువర్ధన్, మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


