ఓటు హక్కు వినియోగించుకోవాలి
కై లాస్‌నగర్: ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్వీప్ ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఆర్డీవో స్రవంతి జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యోగులు, ఆశాలు, అంగన్‌వాడీలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపేలా వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీనివాస్, డీపీఆర్‌ఓ విష్ణువర్ధన్, మెప్మా పీడీ రాజు, తహసీల్దార్లు శ్రీనివాస్, గోవింద్, వేణుగోపాల్‌తో ఇతర అధికారులు, యువత, స్థానికులు పాల్గొన్నారు.


