నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

Jan 30 2026 6:58 AM | Updated on Jan 30 2026 6:58 AM

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ఆదిలాబాద్‌టౌన్‌: ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠి నచర్యలు తప్పవని డీఎంహెచ్‌వో నరేందర్‌ రా థోడ్‌ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని త్రినేత్ర డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. స్కానింగ్‌ సెంటర్‌కు వచ్చిన గర్భిణుల పూర్తి వివరాలు రికార్డుల్లో నమోదు చేసి వారానికోసారి తెలుపాలని సూచించారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో డాక్టర్‌ వైసీ శ్రీనివాస్‌ ఉన్నారు.

వైద్యసిబ్బంది ఆరోగ్యంపై దృష్టి

వైద్యసిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ తెలిపా రు. వైద్యసిబ్బంది హెపటైటిస్‌–బీ బారిన పడకుండా పట్టణంలోని హమాలీవాడ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ చేపట్టారు. జిల్లాలోని 22 పీహెచ్‌సీలు, ఐదు పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో పనిచేసే హెల్త్‌ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొదటి డోస్‌ వేసిన నెల తర్వాత రెండో డోస్‌, ఆరు నెలల తర్వాత మూడో డోస్‌ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అంతకుముందు డీఎంహెచ్‌వో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో సాధన, రిమ్స్‌ వైద్యుడు గజానంద్‌, డీఐవో డాక్టర్‌ వైసీ శ్రీనివాస్‌, నోడల్‌ అధికారి శ్రీకాంత్‌, క్షయ నివారణ అధికారి డాక్టర్‌ సుమలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement