ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులకు శిక్షణ ఇవ్వగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో మైక్రో అ బ్జర్వర్లు, జోనల్ అధికారుల పాత్ర కీలకమని, ఎన్ని కల ప్రవర్తనా నియమావళిపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు హనుమంతు నాయక్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ నివేదికలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి
మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించనున్న అధి కారులు, సిబ్బంది ఈ నెల 6నుంచి 8వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవా లని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మున్సిపల్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్
కేంద్రాల పరిశీలన
పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఆయన వెంట సాధారణ పరిశీలకుడు హనుమంతు నాయక్, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్‌రావు, మెప్మా పీడీ రాజు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్వేత తదితరులున్నారు. కాగా, బీఎల్వోలు కలెక్టర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి పోల్ చీటీ అందజేశారు.
వందశాతం ఓటింగ్ నమోదు కావాలి
ఈ నెల 11న నిర్వహించన్నున మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు కావాలని కలెక్టర్ రాజార్షి షా సూచించారు. పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీని ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ ఎస్టీయూ భవ న్‌కు చేరుకుంది. అక్కడ ఓటు ప్రాముఖ్యతను తెలి పేలా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందాలు ఆలపించిన చైతన్య గీతాలు ఆకట్టుకున్నా యి. స్వయంగా కలెక్టర్ ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజలంతా ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా, నిర్భయంగా ఓటేయాలని కోరా రు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు, స్వ చ్ఛంద సంస్థలు కృషి చేయాలని సూచించారు. అ నంతరం స్వీప్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. ఓటుహక్కు వినియోగంపై ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, మైనారిటీ సంక్షేమాధికారి ఖలీమ్, మెప్మా పీడీ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.


