మున్సిపల్‌లో గులాబీ జెండా ఎగురవేస్తాం
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. రెబల్ ఎవరూ లేరని, కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందంతో ఉన్నాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి తర్వాత నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో బాసరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆయన పూటకోమాట మాట్లాడున్నారని విమర్శించారు. అలాగే జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైనప్పటికీ దాని ఊ సే లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి హిందుత్వం గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఇజ్జగిరి నారాయణ, పండ్ల శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


