తొమ్మిది సార్లు ఎన్నికలు.. ఒక్కరే మహిళా చైర్‌పర్సన్
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలి టీ 1952లో ఆవిర్భవించింది. 46 ఏళ్ల పాటు గ్రేడ్–2గా ప్రజలకు సేవలందించింది. 1998లో గ్రేడ్–1 అప్ గ్రేడ్ అయింది. ఇప్పటి వరకు మొత్తం తొ మ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. 14 మంది చైర్మన్లుగా సేవలందించారు. అయితే కేవలం ఒకే ఒక్క మహిళ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో మున్సిపల్ పీఠం మహిళలకు కేటాయించారు. దీంతో పట్టణంలోని 48వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన రంగినేని మనీషా విజయం సాధించి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 3.7.2014 నుంచి 2.7.2019వరకు బాధ్యతల్లో కొనసాగారు. మరుసటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున టికెట్ దక్కకపోవడంతో పోటీకి దూరమయ్యారు. తాజాగా నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ తరఫున ప్రత్యేక ప్యానెల్‌తో ఆమె బరిలోకి దిగుతున్నారు. మరోసారి అదే వార్డు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజల ముందుకు వెళుతున్నారు.


