కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈనెల 11న నిర్వహించే మున్సి పల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మత్ హుస్సేన్ కోరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పేదల సంక్షేమం కో సం పనిచేసే పార్టీ అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు. గడిచిన పదేళ్లలో అధి కారంలో ఉన్న బీఆర్‌ఎస్ సర్కారు ఆదిలాబాద్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లోనూ తెలంగాణకు మొండిచేయి చూపిందన్నారు.అభివృద్ధిలో విఫలమైన బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు.ఇందులో డీసీ సీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు.


