పాతికేళ్లు నిండని వారు..
ఏడు పదులు దాటిన వారు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో యువతరంతో పాటు వయో వృద్ధులు సైతం నిలవడం ఆసక్తి కలిగిస్తోంది. పాతికేళ్లు సైతం నిండని వారి నుంచి ఏడు పదులు దాటిన వారు కూడా కౌన్సిలర్‌గా పోటీ పడుతున్నారు. వీరిలో అత్యధికులు 40 ఏళ్లలోపు వారే ఉండటం రాజకీయాలపై యువతలో వస్తున్న చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా బీజేపీ యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి టికెట్లను కేటాయించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తరఫున ఒకటి, రెండు వార్డుల్లో యువత పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి పలువురు యువకులు టికెట్లు ఆశించి నామినేషన్లు వేశారు. అయితే ఆయా పార్టీల తరఫున అభ్యర్థిత్వం దక్కకపోవడంతో ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వృద్ధ అభ్యర్థులు సైతం యువతతో పోటీ పడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా పాత, కొత్తతరం అభ్యర్థుల ప్రచారంతో పుర రాజకీయ వేడెక్కింది. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్నికల బరిలో నిలువడం రాజకీయాలపై వారికున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.
అభ్యర్థులు
61–70
51–60
31–40
41–50
23–25
70–75
పాతికేళ్లు నిండని వారు..
పాతికేళ్లు నిండని వారు..
పాతికేళ్లు నిండని వారు..


