పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ
కై లాస్‌నగర్: మున్సిపల్ ఓట్ల లెక్కంపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ రాజర్షి షా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు సోమవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని తెలిపారు. ప్రతీ అంశంపై పూర్తి అవగాహన అవసరమన్నారు. కౌంటింగ్ రోజున అభ్యర్థుల సమక్షంలో ప్రతీ దశను వీడియోగ్రఫీ చేస్తూ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించా రు. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ఈసీ నిబంధనల ప్రకారం లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటిస్తామన్నారు. 49 వార్డుల కౌంటింగ్ కోసం 49 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో వార్డులో సుమారు 3వేలకు పైగా ఓట్లు ఉండే అవకాశమున్నందున మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ఈ నెల 12న నిర్వహించే రెండో విడత శిక్షణకు, అలాగే 13న జరిగే కౌంటింగ్ రోజున నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్‌రావు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులంతా ఓటేయాలి
అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకుని వందశాతం పోలింగ్ నమోదులో భాగస్వాములు కావా లని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సోమవారం స్వీప్ ఓటరు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు బాధ్యతగా విని యోగించాలని కోరారు. సాధారణ పరిశీలకులు హ నుమంత్ నాయక్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తెలంగా ణ సాంస్కృతిక సారధి బృందం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


