సౌమ్యకు ఎకై ్సజ్ శాఖ నివాళి
ఆదిలాబాద్‌టౌన్: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్యకు ఆ శాఖ అధికారులు గురువారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నివాళులర్పించారు. ఆమె చి త్రపటానికి పూలమాలలు వేశారు. కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎకై ్సజ్ అధికారి హిమశ్రీ, సీఐలు విజేందర్, గంగా రె డ్డి, అక్బర్ హుస్సేన్, మురళీకృష్ణ, టీఎన్జీవో నా యకుడు అరుణ్‌కుమార్, కానిస్టేబుళ్లున్నారు.
హైకోర్టును
ఆశ్రయించిన వ్యాపారులు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలో ప్రారంభించిన రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనులపై పట్టణానికి చెందిన 25మంది వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ తరఫున న్యాయవాది వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకా రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా పిటిషనర్లను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని కోర్టు సూచించినట్లు పేర్కొన్నారు.


