సమగ్ర సర్వే పారితోషికమేది? | - | Sakshi
Sakshi News home page

సమగ్ర సర్వే పారితోషికమేది?

Jan 30 2026 6:58 AM | Updated on Jan 30 2026 6:58 AM

సమగ్ర సర్వే పారితోషికమేది?

సమగ్ర సర్వే పారితోషికమేది?

● నేటికీ జమ కాని నిధులు ● ఎదురుచేస్తున్న సిబ్బంది ● అధికారుల చుట్టూ ప్రదక్షిణ

బోథ్‌: జిల్లావ్యాప్తంగా గతేడాది సమగ్ర ఇంటింటి కటుంబ సర్వే నిర్వహించిన సిబ్బందికి ఇప్పటివరకు పారితోషికం అందలేదు. సర్వేలో భాగంగా సా మాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణ న చేపట్టారు. ఈ సర్వే చేసిన గణకులు (ఎన్యుమరేటర్లు), సూపర్‌వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇ ప్పటికీ నయా పైసా చేతికి రాలేదు. వారు పారితో షికం కోసం 13నెలలుగా ఎదురుచూస్తున్నారు. స మగ్ర సర్వే పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, జూని యర్‌ అసిస్టెంట్లు ఎన్యుమరేటర్లుగా పనిచేశారు. సూపర్‌వైజర్లుగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇత ర శాఖలకు చెందిన అధికారులను నియమించారు. వీరిలో ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్‌వైజర కు రూ.12వేల చొప్పున పారితోషికం అందజేస్తామ ని చెప్పారు. సర్వే పూర్తయిన తర్వాత డాటా నమో దు ఆపరేటర్లను తీసుకున్నారు. ఒక్కో సర్వే ఫారం వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేసినందుకు రూ.25 చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా కంప్యూటర్‌పై అవగాహన ఉన్న చాలామందిని తీసుకున్నారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు సర్వేకు సంబంధించిన డాటాను ఎంట్రీ చేశారు.

వివరాలు తీసుకున్నా జమ కాలే..

గతేడాది నిర్వహించిన సమగ్ర ఇంటింటి కటుంబ సర్వేలో జిల్లాలో 174 మంది సూపర్‌వైజర్లుగా, 2,186 మంది ఎన్యుమరేటర్లుగా, 412మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేశారు. సర్వేలో పాల్గొన్న సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు పారితోషికం జమ చేయడానికి ఆయా మండలాల్లోని మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎంపీడీవోలకు తమ బ్యాంక్‌ ఖాతా వివరాలు అందించా రు. అయితే ఇప్పటివరకు ఆ ఖాతాల్లో డబ్బులు జ మ కాలేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయని పలువు రు గణకులు, డేటా ఆపరేటర్లు అడుగుతున్నారు. జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి తమ పా రితోషికం ఎప్పుడు వస్తుందని ఆరా తీస్తున్నారు.

త్వరలో డబ్బులు

జమయ్యే అవకాశముంది

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పారితోషికం డబ్బులు ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. ఇప్పటికే వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలోనే పారితోషికం డబ్బులు ఖాతాల్లో జమయ్యే అవకాశముంది.

– రమేశ్‌, ఎంపీడీవో, బోథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement