తాగునీటి సమస్య పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌

Jan 30 2026 6:58 AM | Updated on Jan 30 2026 6:58 AM

తాగునీటి సమస్య పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌

తాగునీటి సమస్య పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌

● కలెక్టర్‌ రాజర్షి షా ● అధికారులతో సమీక్ష

కై లాస్‌నగర్‌: రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఫిబ్రవరి 1నుంచి 20వరకు ప్రత్యే క డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌ రాజార్షిషా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం తాగునీటి సరఫరా, మనబడి–మన నీరు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా మ హిళాశక్తి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనబడి–మన నీరు కింద పాఠశాలల్లో పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని తె లిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి, లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందించాలని హౌసింగ్‌ అధికారులను సూచించారు. ఇందిరా వ హిళాశక్తి కార్యక్రమాల్లో బ్యాంక్‌ లింకేజీ, ఇన్నోవేటి వ్‌ యూనిట్లు, ఎన్‌పీఏ రికవరీపై దృష్టి సారించాలని ఆదేశించారు. డీఆర్డీవో రవీందర్‌, డీపీవో రమేశ్‌, హౌసింగ్‌ పీడీ షాకీర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ చంద్రమోహన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నిరంతరం నిఘా ఉంచాలి

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై నిరంతరం నిఘా పెంచాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్‌ సర్వైలెన్స్‌ (ఎస్‌ఎస్‌ టీ) బృందాల అధికారులకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దే శం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. ప్రతీ తనిఖీని వీడియో రికార్డు చేయాలని, నిబంధనల ప్రకారం రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. శిక్షణ అనంతరం ఆయా బృందాలకు కేటాయించిన వాహనాలను కలెక్టర్‌, ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంతునాయక్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అడిషనల్‌ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, మెప్మా పీడీ సీవీఎన్‌ రాజు, డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌రావు తదితరులున్నారు.

నిబంధనలు పాటించాలి

ఎన్నికల ప్రచార పత్రాలను ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు విధిగా పాటించాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు డీ.హనుమంత్‌ నాయక్‌తో కలిసి ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ కరపత్రం, బ్యానర్‌పై ముద్రణదారు, ప్రచురణకర్త పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలని సూచించారు. లేకుంటే వాటిని చట్టవిరుద్ధంగా పరిగణించి, సంబంధిత ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్ని కాపీలు ముద్రించారు, దానికై న ఖర్చు ఎంత.. అనే సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు నివేధించాలని సూచించారు. ప్రచురణకర్త నుంచి ముందస్తుగా నిర్ణీత నమూనాలో డిక్లరేషన్‌ తీసుకున్న తర్వాతే ఆర్డర్లు స్వీకరించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు ఎస్‌.రాజేశ్వర్‌, శ్యామలాదేవి, మున్సిపల్‌ కమిషనర్‌, జీ రాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement