అమ్మో.. బూచోళ్లు..! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. బూచోళ్లు..!

Feb 5 2026 7:30 AM | Updated on Feb 5 2026 7:30 AM

అమ్మో

అమ్మో.. బూచోళ్లు..!

● చిన్నారులపై అఘాయిత్యాలు ● అవగాహన లేమితో అనర్థాలు ● గుడ్‌టచ్‌ అంటే ప్రేమతో సంరక్షణతో ఇచ్చే స్పర్శ. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ పిల్లలను కౌగిలించుకోవడం. చిన్నారులకు భద్రత, ధైర్యం, అనురాగం అందించేవి. ● బ్యాడ్‌ టచ్‌ అంటే పిల్లలకు అసౌకర్యం, భయం, బాధ కలిగించేది. ముఖ్యంగా శరీరంలోని ప్రైవేటు అవయవాలను అనుచితంగా ఎవరైనా తాకడం లేదా ఇతరుల అవయవాలను తాకాలని చెప్పడం బ్యాడ్‌ టచ్‌గా పరిగణించాలి. ఈ పరిస్థితుల్లో పిల్లలు భయపడకుండా కుదరదు అని చెప్పడం లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేసేలా చూడాలి. ● పిల్లలకు చిన్న వయసునుండే వారి శరీరం వారి స్వంతమని ఎవరైనా అసౌకర్యంగా తాకితే అభ్యంతరం చెప్పే హక్కు ఉందని అవగాహన కల్పించాలి. వారు సులువుగా నేర్చుకునేలా కథలు, చిత్రాల ద్వారా నేర్పించాలి. ● తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండడం ఎంతో కీలకం. వారు చెప్పే మాటలు శ్రద్ధగా వినడంతోపాటు వారి మాటలపై ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. వారికి ఇచ్చే ధైర్యంతో చిన్నారులు తమ సమస్యలు చెప్పడం ద్వారా బయటపెడతారు.

దారి తప్పుతున్న బాల్యం

మైనర్లు లైంగికదాడులు, నేరాలకు పాల్పడడం ఆందోళన కలిగించే అంశం. నేరాలు పెరగడానికి కుటుంబ విలువలు పడిపోవడం, మానవత్వం విలువలు తెలియకపోవడం కారణాలుగా మారుతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లోని తాత, నానమ్మ, అమ్మమ్మ ఎదుగుతున్న పిల్లలకు విలువలు తెలియజేసేవారు. మారుతున్న జీవనశైలీలో పాశ్చాత్య, యాంత్రీక జీవన విధానంతో పిల్లలకు మంచీ చెడు చెప్పేవారు కరువయ్యారు. ఆలోచనలు పరిమితమై అవగాహన కోసం ఆస్పత్రులు, పాఠశాలలపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్న మగపిల్లలకు మంచీ చెడు వివరించే వారు లేక మైనర్లుగా ఉన్నప్పటి నుంచే నేరాలకు పాల్పడుతున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల చింతలమానెపల్లి మండలంలో అఘాయిత్యానికి పాల్పడిన బాలుడు(16) దారి తప్పి జులాయిగా తిరుగుతున్నట్లు తెలిసింది. ఎదిగే పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తల్లిదండ్రులు వృత్తి, ఉద్యోగాల నిర్వహణలో వారిని పట్టించుకోకుండా ప్రోగ్రెస్‌ రిపోర్టు పరిశీలించి సరిపెట్టడంతో ఇతర విషయాలకు ప్రభావితం అవుతున్నారు. 14 నుంచి 16ఏళ్లలోనే మద్యం, మత్తు పదార్థాల వ్యసనాలకు లోనై నేరాలకు పాల్పడుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి.

గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన అవసరం

పిల్లల భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది. లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేందుకు గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

2024

2023

2022

చిన్నారులపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలికలకు గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన లేకపోవడం, ప్రలోభాల ఆశచూపి లైంగికదాడులకు పాల్పడడం అవగాహన లేమిని సూచిస్తున్నాయి. మరోవైపు మైనర్‌ బాలురు అఘాయిత్యాలకు పాల్పడడం భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలంలో ఓ మైనర్‌ బాలుడు బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు రూ.10 ఆశచూపి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత ఏడాది ఏప్రిల్‌లో దహెగాం మండలంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. తల్లిదండ్రులు, సమాజం చిన్నారుల భద్రతపై సరైన చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. – చింతలమానెపల్లి

కుమురంభీం జిల్లాలో

పోక్సో కేసుల వివరాలు

మైనర్లు అయినా చట్టాలు కఠినమే..

చట్టం ప్రకారం 18ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. కానీ తీవ్రమైన నేరాలకు పాల్పడిన సందర్భంలో చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవు. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో పోక్సో వంటి కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. జువైనల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడితే బాలుడికి 16 సంవత్సరాలు ఉన్నప్పటికీ అడల్ట్‌గానే గుర్తిస్తారు. దీని ప్రకారమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు.

అమ్మో.. బూచోళ్లు..!1
1/1

అమ్మో.. బూచోళ్లు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement