టైగర్‌జోన్ అడ్డంకులు తొలగించాలి
ఉట్నూర్‌రూరల్: టైగర్‌జోన్ అడ్డంకులు తొలగించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష చేయాల్సి వస్తుందని ఆదివాసీ కోలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు హెచ్చరించారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ అడ్డంకులు తొలగించడంతో పాటు ఆదివాసీ గిరిజనుల ఆలయాలను రక్షించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ గిరిజనులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విషయాలను పీవో దృష్టికి తీసుకువెళ్లగా ఈ నెల 20న సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని సోనేరావు వివరించారు. ఆయన వెంట ఆత్రం భీంరావ్, రాజు, జంగు తదితరులున్నారు.


