యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
సాత్నాల: యువత మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని జైనథ్ సీఐ శ్రావణ్ అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్‌లో భాగంగా బుధవారం బేల మండలంలోని సైద్‌పూర్‌లో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. సీఐ మా ట్లాడుతూ ప్రజలు, యువత గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల ని సూచించారు. మహిళలను గౌరవించాలని, గృహహింస చర్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, బేల ఎస్సై ఎల్.ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.


