ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

Feb 10 2026 7:34 AM | Updated on Feb 10 2026 7:34 AM

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

● ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌

ఉట్నూర్‌రూరల్‌: ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పట్టా మంజూరు చేయాలని ఉట్నూర్‌ మండలం శ్యాంపూర్‌కు చెందిన దుర్గం ధర్మయ్య, బోర్‌వెల్‌ మంజూరు చేయాలని ఇంద్రవెల్లి మండలం మార్కగూడకు చెందిన దేవరావు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నార్నూర్‌కు చెందిన సరిత, దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని ఉట్నూర్‌ మండలం రామగూడకు చెందిన మారుతీరావు అర్జీలు సమర్పించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement