బాలురకు సైతం అవగాహన కల్పించాలి
బాలికలు, అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. దీంతోపాటు తప్పుగా ప్రవర్తిస్తే జరిగే పరిణామాలను బాలురు, అబ్బాయిలకు సైతం వివరిస్తున్నాం. అదుపు తప్పి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు, శిక్షలను బాలురకు తగిన వయసులో వివరించాలి. మైనర్లు అయినా నేరాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. – బూర్ల మహేష్,
జిల్లా బాలల సంరక్షణ అధికారి
పిల్లలపై పర్యవేక్షణ ఉండాలి
నేటి పరిస్థితుల్లో చిన్నారులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో బాలికలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాని లైంగిక దాడుల బారిన పడకుండా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు అనే విషయంలోనూ స్పష్టత ఉండాలి. ఇంటి చుట్టుపక్కల వివాదాస్పద, మత్తు వ్యసనాలకు లోనైన వ్యక్తులు ఉంటే వారి వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి. డబ్బులు, బహుమతులు వంటి వాటికి ప్రలో భాలకు గురికాకుండా పిల్లలు, టీనేజీ అమ్మాయిలకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ కుటుంబాల్లో చాలామంది పిల్లలను ఇంటి వద్దే ఉంచి తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తగిన బాధ్యత కలిగిన వారి పర్యవేక్షణలో చిన్నారులు ఉంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా చూడవచ్చు.
– కవిత అజయ్,
మానసిక వైద్య నిపుణులు
బాలురకు సైతం అవగాహన కల్పించాలి


