తీర్థయాత్రలకు ‘స్పెషల్‌’ రైళ్లు..! | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకు ‘స్పెషల్‌’ రైళ్లు..!

Feb 10 2026 7:34 AM | Updated on Feb 10 2026 7:34 AM

తీర్థయాత్రలకు ‘స్పెషల్‌’ రైళ్లు..!

తీర్థయాత్రలకు ‘స్పెషల్‌’ రైళ్లు..!

● దివ్య దక్షిణయాత్ర జ్యోతిర్లింగం యాత్రలో తిరువణ్ణామలై రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు దర్శనం ఉంటుంది. మార్చి 21న ప్రారంభమై 28న ముగిస్తుంది. ఈ యాత్ర సికింద్రాబాద్‌, జనగాం, కాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూర్‌, గూడురు, రేణిగుంట మీదుగా సాగనుంది. సాధారణ టికెట్‌ ధర రూ.14,700, త్రీఏసీ టికెట్‌ ధర రూ.22,300, టూఏసీ టికెట్‌ ధర రూ.28,700 నిర్ణయించారు. ● సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్రలో ఉజ్జయిని మహాకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌, ద్వారక, సోమనాథ్‌, పూణే, నాసిక్‌ (త్రయంబకేశ్వర్‌) ఔరంగబాద్‌ (గ్రీష్ణేశ్వర్‌) దర్శనం ఉంటుంది. ఏప్రిల్‌ 14న ప్రారంభమై 24న ముగుస్తుంది. సికింద్రాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ధర్మాబాద్‌, ముద్ధేడ్‌ హుజూర్‌సాహిబ్‌ నాందేడ్‌, పూర్ణమీదుగా సాగనుంది. సాధారణ టికెట్‌ ధర రూ.17,600, త్రీటైర్‌ ఏసీ టికెట్‌ ధర రూ.26,700, టూటైర్‌ ఏసీ టికెట్‌ ధర రూ.34,600 ఉంటుంది.

మార్చి 21, ఏప్రిల్‌ 14న భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైళ్ల రాకపోకలు ప్రతీ రైలులో 639 మంది ప్రయాణికులు 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు సీసీ కెమెరాలతో కూడిన భద్రత

మంచిర్యాలఅర్బన్‌: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తీర్థయాత్రలు చేయాలనుకునే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మార్చి 21, ఏప్రిల్‌ 14 తేదీలలో రెండు ప్రత్యేక ప్యాకేజీలతో భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలును హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. దివ్య దక్షిణయాత్ర జ్యోతిర్లింగం మార్చి 21న ప్రారంభమై 28న ముగియనుంది. సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర ఏప్రిల్‌ 14న ప్రారంభమై 24న ముగియనుంది. సోమవారం మంచిర్యాలలో యాత్రకు సంబంధించిన వివరాలను టూరిజం మానిటర్లు కొక్కుల ప్రశాంత్‌, శ్రీకాంత్‌లతో కలిసి ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్‌ మేనేజర్‌ పీవీ వెంకటేశ్‌ వెల్లడించారు.

ప్రయాణం ఇలా..

సీసీ కెమెరాలతో భద్రత..

తీర్థయాత్రకు వెళ్లే భక్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోచ్‌, సెక్యూరిటీ గార్డు, రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రతను కల్పించనున్నారు. రైలు, బస్సు, హోటల్‌ అన్ని (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం) తాగునీటి బాటిల్‌, టూర్‌ ఎస్కాట్‌ సేవలతో సందర్శనా స్థలాలు ఉండనున్నాయి. ప్రయాణ బీమా, రైల్వేస్టేషన్‌ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితంగా ప్రకటించారు. ప్రతీ రైలులో 639 మంది ప్రయాణికులు ఉండనున్నారు. ప్రతీ 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు. తీర్థయాత్రకు వెళ్లే భక్తులు ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 9701360701, 9281030727, 9281030759 నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement