జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక
నేరడిగొండ: మండల కేంద్రంలోని కేజీబీవీలో ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని కల్లూరి హరిత జాతీయస్థాయి అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మోడల్ స్కూల్‌లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గతనెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చింది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున హరిత పాల్గొననున్నట్లు ప్రత్యేక అధికారి రజిత తెలిపారు. ఉమ్మడి జిల్లా క్రీడల సమాఖ్య కార్యదర్శి బి.బాబురావు, పీఈటీ స్నేహ, ఉపాధ్యాయులు గురువారం ఆమెను అభినందించారు.


