మద్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

మద్యం పట్టివేత

Feb 9 2026 7:38 AM | Updated on Feb 9 2026 7:38 AM

మద్యం పట్టివేత

మద్యం పట్టివేత

● సంజయ్‌నగర్‌లోని ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తూ, అదే ఆవరణలో అద్దెకు ఉంటున్న నలవల సుమ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రూ.47,740 విలువ గల 50.580 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జి జి.వెంకటరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం తరలిస్తున్న టీచర్స్‌ కాలనీకి చెందిన జక్కుల సచిన్‌పై సుమోటో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.4,520 విలువ గల 15.6 లీటర్ల మద్యంతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాహన తనిఖీల్లో రణదీవెనగర్‌కు చెందిన చందాల రవి, అజయ్‌ మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. వారి నుంచి రూ.13,440 విలువ గల 17.280 లీటర్ల 96 క్వార్టర్ల మద్యం బాటిళ్లతోపాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.

ఆదిలాబాద్‌టౌన్‌: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు. శనివారం రాత్రి వన్‌టౌన్‌ ఎస్సై రమ్య ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్న పట్టణంలోని మోచిగల్లికి చెందిన భూపతి వెంకటేశ్‌, గంటికళ్ళ ముఖేశ్‌ను గుర్తించినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.9,120 విలువ గల 8.64 లీటర్ల 48 క్వార్టర్ల మద్యం బాటిళ్లతోపాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. జైనథ్‌ మండలం కూర గ్రామానికి చెందిన అలిపెల్లి గంగమ్మ రూ.3620 విలువ గల 5 లీటర్ల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌రూరల్‌ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన గోపతి శ్రీనివాస్‌ రూ.4080 విలువ గల 5.76 లీటర్ల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ముగ్గురిపై కేసు..

ఆదిలాబాద్‌రూరల్‌: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బార్‌ యజమాని కళ్లెం శ్రీనివాస్‌తోపాటు మద్యం తీసుకెళ్తున్న అబ్దుల్‌ ఫహీం, అభ్యర్థి అనిల్‌పై ఆదివారం కేసు నమోదు చేసిన్నట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 11వ వార్డుకు చెందిన అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేసేందుకు పట్టణంలోని దుర్గబార్‌ నుంచి అబ్దుల్‌ ఫహీం 48 క్వార్టర్లను మద్యాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. రూ. 9,120 విలువ గల మద్యం 8.6 లీటర్లు పట్టుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement