నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: నిబంధనలు అతిక్రమించే డయాగ్నోస్టిక్ సెంటర్లపై కఠినచర్యలు తీసుకుంటామని జి ల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ హె చ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జగదాంబ, ఎస్వీ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కానింగ్ పరీక్షల కు వచ్చే గర్భిణుల పూర్తి వివరాలను రిజిస్టర్లలో న మోదు చేయాలని ఆదేశించారు. పీసీ పీఎన్‌డీటీ పో ర్టల్‌లో వివరాలు పొందుపర్చాలని సూచించారు. లింగ నిర్ధారణ చట్టరీత్యానేరమని హెచ్చరించారు. అడిషనల్ డీఎంహెచ్‌వో సాధన, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, మాస్ మీడియా అధి కారి వెంకట్‌రెడ్డి, పోతన్న, రాంప్రసాద్ ఉన్నారు.


