న్యాయవాది ఇంట్లో పోలీసుల సోదాలు
చెన్నూర్: బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నాయకుడు, న్యా యవాది పొన్నం మల్లేశం గౌడ్ ఇంట్లో సీఐ బన్సీలాల్, పోలీసులు, ఎన్నికల అధికారులు తహసీల్దార్ మల్లికార్జున్, ఏవో యామిని సోమవారం సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మల్లేశంగౌడ్ ఇంట్లోనే ఉన్నారు. మద్యం, నగదు, ఓటర్లను ప్రభావితం చేసే సామగ్రి లభించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
మంత్రికి తొత్తులుగా మారిన అధికారులు
ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు మంత్రికి తొత్తులుగా మారారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. క్యాతన్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగించుకొని పొన్నం మల్లేశంగౌడ్ ఇంటికి టీ తాగేందుకు వచ్చానన్నారు. మంత్రి ఆదేశాల మేరకు మల్లేశంగౌడ్ ఇంట్లో సోదాలు చేపట్టారన్నారు. కేవలం బీఆర్‌ఎస్ నాయకులనే పోలీసులు టార్గెట్ చేశారని మండిపడ్డారు.


