బీసీలకు 70శాతం సీట్లు
కైలాస్‌నగర్: సామాజిక న్యాయమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 70శాతం సీట్లు కేటాయించినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాద వ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను మహిళలకు 30 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీల్లోని అన్ని కులాలకు ప్రా తినిధ్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎ స్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సమన్యాయం న్యా యం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపా రు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ను ఆదరించాలని కోరారు.


