నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

Feb 5 2026 7:28 AM | Updated on Feb 5 2026 7:28 AM

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

కై లాస్‌నగర్‌/ఆదిలాబాద్‌రూరల్‌: ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్‌ మాజన్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లా కేంద్రంతో పాటు మావల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కేఆర్‌కే కాలనీలో బుధవారం ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదన్నారు. అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, పంపిణీ వంటి సమాచారం ఉంటే వెంటనే డయల్‌ 100 ద్వారా పోలీసులకు తెలుపాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగేలా అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో ట్రెయినీ ఐపీఎస్‌ రాహుల్‌ కాంత్‌, ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, సీఐలు స్వామి, బి.సునీల్‌ కుమార్‌, కె.నాగరాజు, ప్రేమ్‌ కుమార్‌, ఎస్సైలు నాగనాథ్‌, అశోక్‌, మధు కృష్ణ, రాజశేఖర్‌, రిజర్వ్‌ సిబ్బంది రిజర్వ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ్లాగ్‌మార్చ్‌లో పాల్గొన్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement