వేర్వేరు చోట్ల కలప పట్టివేత
ఇచ్చోడ: పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అక్రమంగా తరలిస్తున్న ఫర్నీచర్‌ను బుధవారం పట్టుకున్నట్లు సిరిచెల్మ టైగర్ జోన్ అటవీశాఖ అధికారి నాగవత్ స్వామి తెలిపారు. ఉట్నూర్ మండలంలోని వడోని గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ దయానంద్ కలపతో తయారు చేసిన ఫర్నీచర్‌ను ఐచర్ వ్యాన్‌లో తరలిస్తుండగా నిర్మల్ జిల్లాలోని మొండిగుట్ట చెక్ పోస్టు వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో దయానంద్ అనే పోలీసు కానిస్టేబుల్ వాడోని గ్రామంలో అక్రమంగా టేకు చెట్లు నరికి ఫర్నీచర్ తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీంతో కానిస్టేబుల్ స్వగ్రామంలో తనిఖీలు నిర్వహించగా మరింత కలప లభ్యమైందన్నారు. తనిఖీల్లో దాదాపుగా రూ.2.5 లక్షల కలపను స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బోథ్: మండలంలోని నిగిని గ్రామ పరిధిలో బుధవారం రూ.22,268 విలువైన కలపను పట్టుకున్న ట్లు ఎఫ్‌ఆర్వో ప్రణయ్‌కుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన బొజ్జ సురేష్, మడావి బాపురావు ఇళ్లల్లో సోదాలు చేయగా కలప లభ్యమైనట్లు పేర్కొన్నారు. అక్రమంగా అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తున్న షేక్ మొయిన్ వద్ద నుంచి రూ.2,479 విలు వైన కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో అటవీ శాఖ సిబ్బంది అనిల్, గోవింద్, ఎఫ్‌ఎస్‌వో ముమ్తాజ్, నాగోరావు పాల్గొన్నారు.
తలమడుగు: మండలంలోని కుచులాపూర్‌లో బుధవారం కలప పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన రమేశ్ ఇంట్లో తనిఖీ చేయగా రూ.50 వేల విలువైన కలప లభ్యమైందన్నారు. కలపను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ గులాబ్‌సింగ్, ఆర్‌ఓ ప్రమోద్ కుమార్, బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్, శరత్‌రెడ్డి, పాల్గొన్నారు.
గుడిహత్నూర్: మండలంలోని ముత్నూర్‌లో బుధవారం అక్రమంగా నిల్వఉంచిన రూ.20 వేల విలుౖ వెన కలపను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఎఫ్‌ఎస్‌వో ఇమ్రాన్, ఎఫ్‌బీవోలు ప్రశాంత్, విశ్వజిత్ ముత్నూర్ గ్రామానికి చెందిన గాటాడే దశరథ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కలప దుంగలు లభ్యం కావడంతో స్వాధీనం చేసుకొని ఇచ్చోడ టింబర్ డిపోకు తరలించి దశరథ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


