న్యాయవాదుల నిరసన
ఆదిలాబాద్‌టౌన్: ఆస్తి తగాదాల విషయంలో తన అన్న నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కారణంగా న్యాయవాది స్వప్న హత్యకు గురైందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ ఆరోపించారు. గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ ఎదుట నిరసన తెలిపారు. కోర్టు ఎదుట రహదారిపై రాస్తారోకో చేశారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగేశ్ మా ట్లాడుతూ.. న్యాయాన్ని రక్షించేవారికే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంజేశారు.


