వామ్మో పులి!
తాంసి: జిల్లాను మళ్లీ పులి భయం పట్టుకుంది. ఏ టా తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్‌గంగ దా టి ఇక్కడికి బెబ్బులి రావడం ఆనవాయితీగా మా రింది. రెండు నెలల క్రితమే వచ్చి వెళ్లిన టైగర్ తా జాగా మళ్లీ ఇక్కడ పంజా విసరుతోంది. రెండు రో జుల క్రితం భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి స మీపంలో ఓ పశువుపై దాడి చేసి హతమార్చిన ఘ టన తెలిసిందే. దీంతో నది పరీవాహక, అటవీ స మీప గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేలకు వెళ్లాలంటే వణికిపోతున్నా రు. పులి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని పశువులకాపరులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పక్షం కిత్రమే వచ్చినట్లుగా అనుమానం
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి పెన్‌గంగ దాటి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. పక్షం రోజుల క్రితమే వచ్చినట్లుగా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా భీంపూర్ మండలంలోని పెన్‌గంగ నదికి అనుకుని ఉన్న తాంసి(కె), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్‌కోటి శివారులో సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. గొల్లఘాట్ శివారులో పంటచేలో మేత కోసం వెళ్లిన ఎద్దుపై దాడి చేసి హతమార్చిన క్రమంలో విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. పులి దాడిలోనే ఆ పశువు మృతి చెందినట్లుగా అటవీ అధికారులు సైతం నిర్ధారించారు.
ఆనవాళ్లు గుర్తించే పనిలో సిబ్బంది
రెండు రోజుల క్రితం పులి దాడిలో హతమైన ఎద్దు కళేబరాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది బెబ్బులి ఆనవాళ్లు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం పలు ప్రాంతాలను పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి కదలికలపై నిఘా పెంచారు. పలుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం
భీంపూర్ మండలంలోని గుంజాల, గొల్లఘాట్, తాంసి(కె) గ్రామాల శివారులో పులి సంచరిస్తున్నందున ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. డీఎఫ్‌వో ఆదేశాల మేరకు రెండు బృందాలతో పాటు పులి కదలికలను గుర్తించేందు కోసం 10 కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం. బాధిత రైతుకు త్వరలోనే పరిహారం అందించేలా చర్యలు చేపడుతున్నాం.
– గులాబ్‌సింగ్, ఎఫ్‌ఆర్వో, ఆదిలాబాద్
వామ్మో పులి!


