భజన గీతం.. వినూత్న ప్రచారం
నిర్మల్‌ఖిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భా గంగా జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ 18వ వా ర్డు పరిధిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భజన మండలి కళాకారులతో భజన గీతాలు పాడిస్తూ కాలనీవాసులను ఓటు అభ్యర్థించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదిలా బాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామానికి చెందిన భజన బృందం తబలా, తప్పెట్లు, తా ళాలతో ఆలపించిన భజన పాటలు కాలనీల్లో మా రుమోగడంతో స్థానికులు ప్రచారాన్ని ఆసక్తిగా వీ క్షించారు. బీడీ కార్మికులు, దిగువ, మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులకు అనుగుణంగా భావోద్వేగాలను తా కే భజన గీతాలను ఎంపిక చేసి ప్రచారం నిర్వహించడం గమనార్హం.


