ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు

Feb 10 2026 7:34 AM | Updated on Feb 10 2026 7:34 AM

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు

● ఓటు హక్కు వినియోగించుకున్న 435 మంది

కై లాస్‌నగర్‌: ఈ నెల 11న మున్సిపల్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు సోమవారంతో ముగిసింది. మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఈ నెల 6నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. నాలుగు రోజుల్లో 435 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో 52 మంది సర్వీస్‌ ఓటర్లతో పాటు ఇతర మరో ఉద్యోగికి పోస్టల్‌ బ్యాలెట్‌ను వారి చిరునామాకు పంపించారు. ఈ బ్యాలెట్‌ పత్రాలు కౌంటింగ్‌కు ముందు రోజు వరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి చేరేలా చూడాల్సి ఉంటుంది. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను ప్రత్యేక గదిలో భద్రపరిచి సీల్‌ వేశారు. వాటిని ఓట్ల లెక్కంపు రోజున కౌంటింగ్‌ కేంద్రానికి తరలించనున్నట్లు ఎన్నికల నోడల్‌ అధికారి ఫణిందర్‌ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement