స్వీప్ అవగాహన ర్యాలీ ప్రారంభం
కై లాస్‌నగర్: రవాణశాఖ ఆధ్వర్యంలో 120 ఆటోలతో చేపట్టిన భారీ ఓటరు అవగాహన ర్యాలీని కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, ఎస్.రాజేశ్వర్‌తో కలిసి జిల్లా కేంద్ర గ్రంథాలయం వరకు ఆటోలో ప్రయాణించారు. కలెక్టరేట్ నుంచి మొదలైన ర్యాలీ కలెక్టర్‌చౌక్, వినాయక్ చౌక్, దేవిచంద్ చౌక్, అంబేడ్కర్ చౌక్, నెహ్రూ చౌక్ మీదుగా జిల్లా గ్రంథాలయం వరకు కొనసాగింది. అంతకుముందు ఆటోలకు స్వీప్ అవగాహన స్టిక్కర్లు అతికించారు. గ్రంథాలయ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, యువకులు, ప్ర జలు, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో స్రవంతి, డీవైఎస్వో శ్రీనివాస్, నోడల్ అ ధి కారులు మనోహర్, రాజలింగు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ హరీంద్ర కుమార్, అసిస్టెంట్ మో టార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్వేత, తహసీల్దార్ శ్రీని వాస్, గ్రంథాలయ అధికారి శ్రీనివాస్ తదితరులున్నారు.


