క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్‌

Feb 1 2026 3:19 AM | Updated on Feb 1 2026 3:19 AM

క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్‌

క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్‌

ఆదిలాబాద్‌: ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌వో జక్కుల శ్రీని వాస్‌ తెలిపారు. ఇందులో భాగంగా మున్సిప ల్‌ స్థాయి పోటీలను జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదం చే స్తాయన్నారు. ఆయా క్రీడాంశాల్లో అన్ని వయస్సుల విభాగాల వారికి అవకాశాలు ఉన్నాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ మెంబర్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ క్రాంతి కుమార్‌, స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణ, పీడీ హరిచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement