విద్యార్థులకు అవగాహన కల్పించాలి
నార్నూర్: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం గాదిగూడ మండలంలోని అర్జుని గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించగా కలెక్టర్ హాజరై విద్యార్థులు తయారు చేసిన వంటలను పరిశీలించి రుచి చూశారు. గాదిగూడ మండలంలోని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, కలెక్టర్‌కు వివిధ సమస్యలు వివరిస్తూ ఆదివాసీ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూరు సంతోష్, నాయకులు కుమ్రం సతీశ్, పర్చకి హరిదాస్ వినతిపత్రం అందజేశారు. పరిష్కరించా లని కోరారు. కలెక్టర్ వెంట సర్పంచ్ కమలాబాయి, గ్రామ పటేల్ రావుజీ పటేల్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో గంగాధర్, ఎంఈవో రమేశ్, హెచ్‌ఎం శేఖర్‌బాబు, ఉపాధ్యాయురాలు జ్యోతి తదితరులున్నారు.


