కృష్ణా రివర్‌క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన స్విమ్మర్లు విజయవాడలోని దుర్గా ఘాట్‌లో ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 26వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. 10 నుంచి 15 ఏళ్ల వయస్సు విభాగంలో చరణ్‌తేజ 15వ స్థానంలో నిలవగా, 31 నుంచి 40 వయస్సుల విభాగంలో కొమ్ము కృష్ణ 12వ స్థానం సాధించాడు. వీరిద్దరు తండ్రి కొడుకులు కావడం విశేషం. అదేవిధంగా 41 నుంచి 50 ఏళ్ల విభాగంలో మేడిపల్లి అశోక్ 25వ స్థానం సాధించి మెరిట్ సాధించాడు. ప్రతిష్టాత్మక రివర్ క్రాసింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పెటా సంఘం అధ్యక్షుడు పార్థసారధి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి హరిచరణ్ తదితరులు అభినందించారు.


